స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన2008-9,10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు
తమతో బాల్యంలో చదివిన స్నేహితుడు నేడు తండ్రిని కోల్పోయి కష్టాల్లో ఉన్న స్నేహితునికి అండగా ఉండాలని తలచి చిరుసాయం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు.పల్లెర్ల గ్రామానికి చెందిన కొమ్ము నరేష్ తండ్రి నర్సయ్య మరణించారు. వారితో చదువుకున్న 2008-9, 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు అప్పటి ప్రధానోపాధ్యాయులు వెంకన్న స్పూర్తితో వారి కుటుంబానికి 14,050 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. వారు మాట్లాడుతూ చిన్నప్పుడు కలిసి చదువుకున్నాము కష్టాల్లో ఉన్న స్నేహితులకి అండగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కన్నెబోయిన రవికుమార్ బోలుగుల్ల నరేష్ మోత్కూర్ శేఖర్ బైరోజు నరేష్ 2008-9,10వ తరగతి బ్యాచ్ స్నేహితులు పాల్గొన్నారు.