భవాని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉపాధ్యాయుల సమస్యలపై కీలక చర్చలు
మేడ్చల్ జిల్లా డిసెంబర్, 26సమర శంఖమ్ :-
కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో 2025 క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా పిఆర్టియు టిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి ఉపాధ్యాయుల సంక్షేమం కోసం సంఘం చేసిన కృషిని ప్రస్తావించారు. కౌన్సిలింగ్ విధానం, చైల్డ్ కేర్ లీవ్, 30% ఫిట్మెంట్, 61 సంవత్సరాల వయోపరిమితి పెంపు, సిపిఎస్ ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యూటి వంటి కీలక జీవోలను సాధించిన ఘనత పిఆర్టియు టిఎస్‌కే చెందుతుందని తెలిపారు. రాబోయే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిఆర్టియు టిఎస్ అభ్యర్థులను గెలిపించి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం, కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వచనం పొందారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు టిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్ రెడ్డి (వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి), ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి (కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్), మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బీరెల్లి కమలాకర్ రావు, గుండు లక్ష్మణ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రామేశ్వర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శశిధర్ శర్మ, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మానయ్య, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, కీసర మండల అధ్యక్షుడు చీర యాదగిరి, ప్రధాన కార్యదర్శి ఈగ శ్రీనివాస్, ఇతర మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. పిఆర్టియు టిఎస్ నాయకులు, కార్యకర్తలు ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించి, సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని నిర్ణయించారు.