ఘట్కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియాగాంధీ 78వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి వేముల మహేష్ గౌడ్, ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్మన్ మల్లి పావని జంగయ్య యాదవ్, ఘట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు మామిడ్ల ముత్యాల యాదవ్,ఘట్కేసర్ మండల్ అధ్యక్షులు కర్రె రాజేష్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతుర్తి రవి,ఘట్కేసర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.