24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర

బంగారం ధర భారీ తగ్గింది. నిన్నటితో పోల్చి చూస్తే నేను బంగారం ధర భారీగా పతనం అయినట్టు గమనించవచ్చు. ఫిబ్రవరి 27వ తేదీ గురువారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి.24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 88,280 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 81,100 పలికింది. ఒక కేజీ వెండి ధర రూ. 97, 050 పలికింది. బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. గడచిన నెల రోజులుగా గమనించినట్లయితే బంగారం ధర ఆల్ టైం రికార్డులను ప్రతి రోజు సృష్టిస్తూ వస్తోంది. ఒక దశలో బంగారం ధర 90 వేల రూపాయల సమీపము వరకు వెళ్ళింది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పరిశీలిద్దాం ఆభరణాలు కొనుగోలు చేసేవారికి కాస్త ఇబ్బందిగా మారింది. ఎందుకంటే బంగారం ధర భారీగా పెరిగిన నేపథ్యంలో ఇకపై బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే బంగారం ధరలు ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో పచ్చడి ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా తగ్గిందని ఆభరణాల దుకాణాల యజమానులు చెబుతున్నారు. నిజానికి బంగారం ధర పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిస్థితులే అసలు కారణంగా చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వరుసగా పలు దేశాలతోని వాణిజ్య యుద్ధానికి తెరలేపుతున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవుతున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు ఎక్కువగా తరలిస్తున్నారు. బంగారం ధర పెరగడానికి మరో ప్రధాన కారణం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు ముఖ్యంగా చైనా దేశానికి చెందిన సెంట్రల్ బ్యాంకు విపరీతంగా బంగారం కొనుగోలు చేస్తోంది. భవిష్యత్తులో బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించి చైనా ఈ పని చేస్తోంది. ఇదిలా ఉంటే దేశీయంగా కూడా బంగారం ధరలను భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పసిడి ప్రియులు ఆభరణాలు కొనుగోలు ఎలా చేయాలని ఆలోచిస్తున్నారు.

దీంతో బంగారు ఆభరణాల దుకాణాల వ్యాపారులు బంగారంతో తయారుచేసిన లైట్ వెయిట్ డిజైన్స్ ఎక్కువగా తయారు చేస్తున్నారు అంటే… 10 గ్రాముల లోపే అనేక రకాల డిజైన్స్ తయారు చేస్తున్నారు. మూడు గ్రాముల నుంచే నెక్లెస్ లోను సైతం తయారు చేస్తున్నారు. ఇలాంటి లైట్ వెయిట్ బంగారం ఆభరణాలను కొనుగోలు చేయడానికి జనం ఎక్కువగా ఇష్టపడుతున్నారని పసిడి ఆభరణాల దుకాణదారులు చెబుతున్నారు. అయితే బంగారం ధర భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment