ఆంధ్రప్రదేశ్ సమర శంఖమ్ :-
ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలో మహాశివ రాత్రి బ్రహ్మోత్సవాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకూ జరుగనున్నాయి. 11 రోజులు సాగే ఈ బ్రహ్మోత్సవాల పై దేవస్థానం ఈ ఓ ఎం శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాల అధికారులను ఈవో ఆదేశించారు.