SLBC టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది మృతి
SLBC టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది మృతి చెందారు. ఐదుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ గుర్తించింది. డెడ్ బాడీలను మార్క్ చేసింది రెస్క్యూ టీమ్.3 మీటర్ల మట్టిలోపల మృతదేహాలు లభ్యమైనట్లుగా తెలుస్తోంది. మృతుల్లో ఆరుగురు కార్మికులు. ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. ఆక్వా ఐతో పాటు GPR సిస్టమ్ తో ఐదుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ గుర్తించింది. మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలను టన్నెల్ నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరో ముగ్గురి మృతదేహాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తోంది. మృతదేహాలను గుర్తించడంలో ఐఐటీ మద్రాస్ కు చెందిన నిపుణుల బృందం కీ రోల్ పోషించింది. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ఆధారంగా మృతదేహాలను గుర్తించారు.నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NGRI) రంగంలోకి దిగింది. భూమిలో కూరుకుపోయిన వారి స్థితిని తెలుసుకునేందుకు అత్యాధునికమైన టెక్నాలజీని ఉపయోగిస్తోంది. జీరో గ్రావిటీ పెనట్రేటింగ్ రాడార్ (GPR) టెక్నాలజీని ఉపయోగించి, భూమిలోకి తొలగిపోయిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందం శ్రమిస్తోంది. ప్రాణాలతో వస్తారనుకున్న వారి మృతదేహాలు బయటపడడంతో టన్నెల్ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.