జిల్లా కేంద్రమైన గద్వాలలో ఆదివారం అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పోలీసులు పట్టుకున్నారు. గోనుపాడు నుంచి సుంకులమ్మ మెట్ట మీదగా వెళుతుండగా సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్లు గద్వాల పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ తెలిపారు. డ్రైవర్ మద్దిలేటి, యజమాని కర్రెప్పను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.*
గద్వాల ఇసుక ట్రాక్టర్ పట్టివేత
Published On: January 14, 2025 7:14 pm
