ఈ రోజు ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు G.మురళీదర్ , SI కేసముద్రం గారు తన సిబ్బంది తో కోరుకొండపల్లి క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనికీచేయుచుండగా అనుమానస్పదంగా ఒక తెల్లని ఎర్టిగా ( TS07UP 0754)కారులో 1. ఇద్దరు పఠాన్ అస్లాం ఖాన్ s/o ఆశ్రఫ్ ఖాన్ 28 yr, ముస్లిం, ఆటో డ్రైవర్ r/o నూజివీడు మరియు 2.వెదుల ప్రదీప్ కుమార్ తండ్రి, శ్రీనివాస మూర్తి, 32yr, బ్రాహ్మణ, క్యాబ్ డ్రైవర్ r/o చల్లపల్లి, వైజాగ్ అను వారు అక్రమంగా వైజాగ్ దగ్గర గల సీలేరు నుండి ఎండు గంజాయి రవాణా చేయుచుoడగా వారిని అదుపులోనికి తీసుకొని వెంటనే ఇద్దరు పంచుల సమక్షంలో 05 కిలోల గంజాయిని ( విలువ రూ. 125000 /-) మరియు కారును, రెండు మొబైల్ ఫోన్ లను సీజ్ చేసి, నేరస్తులను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయనైనది. ఇట్టి విషయంలో P. సర్వయ్య, CI మహుబాద్ రూరల్ గారిని, కేసముద్రం SI మురళీధర్ గారిని మరియు సిబ్బంది R.రాజు pc , K.రామకృష్ణ pc, D.మహేందర్ pc , B.వెంకన్న pc , K . మధు SP, మహబూబాబాద్ గారు అభినందిచనైనది.
కేసముద్రం లో అక్రమ రవాణా గంజాయి పట్టివేత
Published On: January 15, 2025 5:57 pm
