యాదాద్రి భువనగిరి జిల్లా
వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ రాయగిరి సమీపాన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని కారు వెనుక నుండి బలంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ, చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మహబూబాబాద్ జిల్లా కేసముద్రంకు చెందిన వారిగా గుర్తించారు. పెట్రోల్ పంపు లోకి వెళ్తున్న లారీని వెనుక నుండి కారు బలంగా ఢీకొట్టడంతో ప్రమాద సంభవించిందని స్థానికులు తెలిపారు. కారు పూర్తిగా లారీకి వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. జెసిబి సహాయంతో కారణం బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.