ఫేక్ రిపోర్టర్ల పై చర్యలేక్కడ..?
షాద్ నగర్ లో హల్చల్ చేస్తున్న నకిలీ రిపోర్టర్లు.
హోటల్స్ ప్రైవేట్ క్లినికుల్ చిన్నపాటి నాయకులె టార్గెట్.
రిపోర్టర్ అనే పదానికి అర్థం తెలియని వారు ఆ విలువ తెలియని వారు కూడా తము రిపోర్టర్లమంటు షాద్ నగర్ లో హల్చల్ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆ పిడిఎఫ్ ఆన్లైన్ పత్రికలకు అనుమతులు ఉంటాయో లేదో తెలియదు కానీ తెల్లవారేసరికి శుద్ధ తప్పులతో ఆ పిడిఎఫ్ ఆన్లైన్ పత్రికలకు సంబంధించిన అన్ లైన్ కట్టింగ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటయి. ఇక వీటిని సాకుగా చూపించి చిన్నపాటి హోటల్స్ ప్రైవేటు క్లినికులు చిన్నపాటి రాజకీయ నాయకులను మచ్చిగా చేసుకొని వారికి వ్యక్తిగతంగా మెసేజ్లు పెడుతూ శునకాణంతో పొందుతున్న వారు కొందరైతే ఏకంగా హోటల్స్ ని క్లినకులను బ్లాక్మెయిలింగ్ చేస్తున్న పరిస్థితి వెలుగులోకి వస్తుందని స్థానికులు అంటున్నారు. ఈ మధ్యలో ఇది షాద్ నగర్ లో విచ్చలవిడిగా పెరిగిపోతుందని తాజాగా షాద్ నగర్ పట్టణంలోని పరిగి రోడ్డు లో హో హోటల్ యజమాని బెదిరించినా దుస్థితి వెలుగులోకి వచ్చిందని దీoతో బాధితుడు పోలీస్ స్టేషన్కు సైతం వెళ్లారని తెలిసింది. పిర్యాదు చెయ్యడానికి దీంట్లో కొందరు రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని సంది కుదిరిచినట్టు తెలుస్తోంది ఇంత పెద్దగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగాక పోలీసులు సైతం సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవచ్చు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ఇక బైక్ ల పై కారులపై ప్రెస్ స్టికర్స్ వేసుకొని సైతం చక్కర్లు కొడుతున్న వారిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి వాహనాలపై ప్రెస్ స్టీకర్స్ లను తొలగించాలని కోరుతున్నారు కొందరు సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులు..