ఉదయం కర్ణాటకలోని బీదర్ లో దోపిడీకి పాల్పడ్డ ఇద్దరు దుండగులు 

హైద్రాబాద్ ….ఉదయం కర్ణాటకలోని బీదర్ లో దోపిడీకి పాల్పడ్డ ఇద్దరు దుండగులు 

ఏటీఎంలోకి డబ్బులు నింపుతున్న సిబ్బందిపై కాల్పులు జరిపి 93 లక్షలతో పరార్

నేరుగా బీదర్ నుండి హైదరాబాద్ వచ్చిన దుండగులు

మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో అఫ్జల్గంజ్ లోని రోషన్ ట్రావెల్స్కు చేరుకున్న నిందితులు

హైదరాబాద్ నుండి చతిస్గడ్ లోని రాయపూర్ కి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న ఇద్దరు దుండగులు

7:30 గంటలకు అఫ్జల్గంజ్ నుండి రాయపూర్ కు బయలుదేరనున్న బస్సు

బస్సులోకి ప్రయాణికులను అనుమతించిన తర్వాత వారి లగేజీలను తనిఖీ చేస్తున్న టికెట్ మేనేజర్ జహంగీర్

అదే సమయంలో నిందితుల బ్యాగులను తనిఖీ చేయడానికి ప్రయత్నించగా అడ్డుకున్న దుండగులు

దుండగుల వెనక సీట్ లో ఓ కేసులో భాగంగా హైదరాబాద్ వచ్చిన బీదర్ పోలీసులు..

తాము పోలీసులమని తమ బ్యాగ్ తనిఖీ చేయాల్సిన అవసరం లేదంటూ చెప్పిన పోలీసులు

ఆ విషయాన్ని విని బీదర్ పోలీసులు తమ కోసమే వచ్చారంటూ భావించిన దుండగులు

అదే సమయంలో దుండగుల బ్యాగ్ తనిఖీ చేయాలని పట్టుబట్టిన జహంగీర్

జహంగీర్ కు 50 వేల రూపాయలు ఇచ్చి తమ బ్యాగ్ తనిఖీ చేయొద్దు అంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేసిన నిందితులు

వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో కిందకు దిగాలంటూ హెచ్చరించిన జహంగీర్.

దీంతో వారు బ్యాగులతో పాటు కిందకు దిగగా పోలీసుల భయంతో తప్పించుకోవడానికి జహంగీర్ పై కాల్పులు

సుమారు నాలుగు నుండి ఐదు రౌండ్లు కాల్పులు జరిపిన నిందితులు

కాల్పులు జరిపి డబ్బుతోపాటు అక్కడి నుండి పరారైన నిందితులు.

జహంగీర్ పొట్ట కాలుభాగంలోకి దూసుకు వెళ్లిన బుల్లెట్

సుమారు 200 మీటర్లు ప్రాణ భయంతో పరుగులు తీసి రోషన్ ట్రావెల్స్ వద్దకు చేరుకున్న జహంగీర్

అక్కడే కుప్పకూలిపోవడంతో ఉస్మానియా ఆసుపత్రికి జహంగీర్ను తరలించిన రోషన్ ట్రావెల్స్ యాజమాన్యం

అనంతరం సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.

ఘటనా స్థలంలో క్లూస్ సేకరించిన క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ సిబ్బంది

పరారైన నిందితుల కోసం కొనసాగుతున్న అఫ్జల్గంజ్ పోలీసుల వేట.

Join WhatsApp

Join Now

Leave a Comment