AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై అనుమానిత డ్రోన్ ఎగరడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పవన్ భద్రతపై సోమవారం డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ ఇంటి మీద డ్రోన్ ఎగిరిందా? లేదా? క్లారిటీ లేదని అన్నారు. మరో 24 గంటల్లో పూర్తి వివరాలను మీడియాకు వివరిస్తామని తెలిపారు. డిప్యూటీ సీఎం భద్రతపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
పవన్ క్యాంపు ఆఫీస్‌పై ఎగిరిన డ్రోన్.. డీజీపీ కీలక ప్రకటన
Published On: January 20, 2025 5:41 pm
