Mahakumbh : మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ఆ అమ్మాయి పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వీరి కుటుంబం తరాలుగా పూసల దండలు అమ్ముకుని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే మహాకుంభమేళా సందర్భంగా పూసల దండలు అమ్ముకోవడానికి ప్రయాగ్‌రాజ్‌కు వచ్చింది.
మహాకుంభమేళాలో ఒక యువతి సంచలనంగా మారింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు.. సోషల్‌మీడియాలోనూ ఆమెపైనే చర్చలు.. అలా అని ఆమె ఏదో సెలబ్రెటీయో.. ధనవంతుల బిడ్డనో కాదు.. అందాల అప్సరస అంతకంటే కాదు.. చూడ్డానికి ఛామనఛాయ రంగులో ఉండే అత్యంత సాధారణ అమ్మాయి. పూసల దండలు అమ్ముకుని పొట్టబోసుకోవడమే ఆమె వృత్తి. అయినప్పటికీ ఆమె మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. ఇందుకు కారణం కాటుక దిద్దిన అందమైన తేనే కళ్ళు.. అమాయకమైన చూపులు.. అవే ఇప్పుడు ఆమెను సోషల్‌మీడియా క్వీన్‌ను చేసింది. అంతేకాదు ఆ క్రేజ్‌నే ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ నుంచి సినిమా ఆఫర్‌ను కూడా తీసుకొచ్చింది.