వైసీపీ అరాచక పాలనపై సమరశంఖం పూరించిన లోకేశ్‌ పాదయాత్ర

వైసీపీ అరాచక పాలనపై సమరశంఖం పూరించిన లోకేశ్‌ పాదయాత్ర చేపట్టి సోమవారంతో రెండేళ్లు ముగుస్తాయి. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఆశలు, ఆశయాలను ప్రతిబింబిస్తూ తెలుగుదేశం యువనేత, ప్రస్తుత ఐటీ, మానవవనరుల మంత్రి లోకేశ్‌ 2023 జనవరి 27న పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కుప్పం వరదరాజస్వామి పాదాల చెంత నుంచి నడక సాగించారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3,132 కిలోమీటర్లు నడిచారు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ పాదయాత్ర సాగించారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించి, ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడంలో ఆయన పాదయాత్ర కీలకభూమిక పోషించింది. యువగళం సాగిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90 చోట్ల టీడీపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించారంటే పాదయాత్ర ప్రభావమెంత ఉందో అర్థమవుతోంది. యాత్ర మొదలుపెట్టాక తారకరత్న హఠాన్మరణం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వంటి అనివార్యమైన పరిస్థితుల్లో మినహా ఎలాంటి విరామమూ లేకుండా సాగింది. ఎండ, వాన, తుఫాన్లను సైతం లెక్కచేయకుండా లోకేశ్‌ ముందుకు సాగారు. 226 రోజుల పాదయాత్రలో కోటిన్నర మందిని కలిసి ఉంటారని అంచనా.

Join WhatsApp

Join Now

Leave a Comment