బాబు ష్యూరిటీ.. చీటింగ్ గ్యారెంటీ: రోజా
AP: బాబు ష్యూరిట.. భవిష్యత్ గ్యారంటీ నినాదం చీటింగ్ గ్యారెంటీ అయ్యిందని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ‘అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ ఇస్తాం. మాట తప్పితే కాలర్ పట్టుకుని అడగమని లోకేష్ అన్నారు. ఇప్పుడు ఎవరి కాలర్ పట్టుకోవాలో చెబుతారా? మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కగలదని అప్పుడు జగన్ను చంద్రబాబు అవహేళన చేశారు. మరి ఇప్పుడు బాబు ఎందుకు బటన్ నొక్కడం లేదు’ అని రోజా ఎద్దేవా చేశారు.