కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి ఒరిగింది ఏమి లేదు : తిరుపతి ఎంపీ గురుమూర్తి

కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి ఒరిగింది ఏమి లేదు

రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో కూటమి వైఫల్యం – తిరుపతి ఎంపీ గురుమూర్తి

ప్రస్తుత బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందినదని తిరుపతి ఎంపీ గురుమూర్తి అన్నారు. కూటమి ఎంపీల బలంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అని గొప్పలు చెప్పుకోవడంతోనే సరిపోయిందని బీహార్ రాష్ట్రానికి కేటాయించిన మేర కూడా రాష్ట్రానికి నిధులు సాదించ లేక పోయిందని ఎద్దేవా చేసారు. ఈ బడ్జెట్ ద్వారా మన రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని పెదవి విరిచారు.

కానీ బీహార్ విషయానికి వస్తే బీహార్‌లోని గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధికి నిధులు, పాట్నా విమానాశ్రయం బిహ్తాలోని బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయ విస్తరణ, పశ్చిమ కోషి నీటిపారుదల ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం, బీహార్‌లోని రైతులకు ప్రయోజనం చేకూర్చే మఖానా ఉత్పత్తి, ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్‌ను పెంచడానికి మఖనా బోర్డు ఏర్పాటు, ఫుడ్ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచుతూ ఉపాధి కలిపించడానికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఏర్పాటు వంటి వాటి కోసం నిధుల కోసం కేటాయింపు జరిగిందని ఎంపీ గురుమూర్తి అన్నారు. మొత్తానికి రాష్ట్రానికి రిక్త హస్తం అని ఆయన అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment