గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎకరంలోపు ఉన్న రైతుల సంఖ్య 22,55,181గా గుర్తించి రైతు బంధు అందించాం
కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు అంటూ, ఎకరం ఉన్న రైతులకు అంటూ ఇప్పటి వరకు 21,45,330 రైతులకే రైతు భరోసా వేసింది
అంటే 1,09,851 మంది రైతులకు కోత విధించి రైతు భరోసా ఎగ్గొట్టింది.. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది గోరంత, చెప్పకునేది కొండంత
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో రైతుకు ఎకరానికి 17,500 చొప్పున బాకీ పడింది.. ఈ బాకీని, కోత పెట్టిన 1,09,851 మంది రైతులకు వెంటనే రైతు భరోసా వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు