మద్దుల వాయి గ్రామాల పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుపై అభ్యంతరాలు తెలపాలి : అదనపు కలెక్టర్ నగేష్    

మద్దుల వాయి గ్రామాల పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుపై అభ్యంతరాలు తెలపాలి : అదనపు కలెక్టర్ నగేష్        

                     

సోమవారం మెదక్ మండలం రాజ్ పల్లి, హవేలీ ఘన్పూర్ మండలం మద్దుల వాయి గ్రామాల పోలింగ్ స్టేషన్ల ఏర్పాటులో భాగంగా వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధుల అభ్యంతరాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, మద్దుల వాయి రాజ్ పల్లి పోలింగ్ స్టేషన్ల డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసుకోవడం జరిగిందని మద్దుల వాయు (08) పోలింగ్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, 8 వార్డులు ఉన్నాయని 189 పురుష ఓటర్లు ఉండగా, 231 మహిళా ఓటర్లు ఉన్నారని వివరించారు. రాజ్ పల్లి లో (10) వార్డులకు గాను (10) పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయగా 959 పురుష ఓటర్లు ,1097 మహిళా ఓటర్లు ఉన్నారని వివరించారు పొలిటికల్ పార్టీలు పోలింగ్ స్టేషన్ కు సంబంధించిన అభ్యంతరాలు తెలపాలని ఈ సమావేశం ద్వారా అడిషనల్ కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో, డిపిఓ యాదయ్య, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, మెదక్ ఆర్డిఓ రమాదేవి, తూప్రాన్ ఆర్డీవో జై చంద్రారెడ్డి,నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి, రాజకీయ పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment