నేలపట్ల గ్రామంలో గెట్ టు గెదర్
చౌటుప్పల్ మండలం నెలపట్ల గ్రామంలో సోమవారం రోజున పూర్వ విద్యార్థులు గెట్ టు గెదర్ కార్యక్రమం నిర్వహించారు. గెట్ టుగెదర్ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులకు బోధించిన ఉపాధ్యాయులని ఆహ్వానించారు. చిన్ననాటి గుర్తులు గుర్తు చేసుకుంటూ సంబరం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రమణమూర్తి సార్, తెలుగు పండితులు చంద్రశేఖర్ రెడ్డి, కృపాకర్ రెడ్డి, రామ్ రెడ్డి, భారతి మేడం, అంజయ్య సార్, భానుచందర్, పూర్వ విద్యార్థుల సమ్మేళన సమావేశం ఆర్గనైజర్ చేసినటువంటి విద్యార్థులు గంగాపురం నాగేష్ గౌడ్ ప్రమోద్ కుమార్ ఢిల్లీ సురేందర్ రెడ్డి సిప్పంగి యాదగిరి తలకా వెంకటేష్ బాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.