లాయర్ దంపతుల హత్య కేసులో విచారణ వాయిదా!

లాయర్ దంపతుల హత్య కేసులో విచారణ వాయిదా!

పెద్దపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన దారుణ హత్యకు గురైన అడ్వకేట్ దంపతులు గట్టు వామన్ రావు-నాగమణిల కేసుపై వామన్ రావు తండ్రి కిషన్ రావు దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.

పిటిషనర్ తరపు న్యాయ వాదులు హత్య ఘటనలో పుట్ట మధుకర్ హస్తం ఉందని గట్టు వామన్ రావు మరణ వాంగ్మూలంలో ఆయన పేరు ఉందని వాదించగా, డిపెన్స్ న్యాయవాదులు పుట్ట మధుకర్ కు సంబంధం లేదని, కక్ష పూరితంగా ఆయన పేరును ఇరికించారని వాదించారు.

ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది తెలపగా కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేయడా నికి తమకు అభ్యంతరం లేదని సీబీఐ న్యాయవాది తెలిపారు. దీనిపై డిఫెన్స్ వారి కౌంటర్ కు రెండు వారాలు గడువు ఇస్తూ కేసును వాయిదా వేశారు.

కాగా మరో వారం రోజుల్లో హత్య జరిగి నాలుగు ఏండ్లు గడుస్తున్న సందర్బంగా ఈ కేసులో ఏమి జరుగుతుందో అని మంథని, రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment