సీఎం రేవంత్ ని కలిసిన మంద కృష్ణ మాదిగ..!
షెడ్యూల్డు కులాల వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ గారి నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ సిఫారసులను శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి #MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ గారు కలిశారు.కమిషన్ చేసిన సిఫారసుల్లో క్రీమీలేయర్ ప్రతిపాదనను తిరస్కరించి, మిగతా వర్గీకరణ ప్రతిపాదనలను శాసనసభ ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే.వాటిని మరోసారి పరిశీలించాలని కోరారు. అసెంబ్లీలో చర్చించి, కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి న్యాయ కమిషన్ వేసి, నివేదికలను వేగంగా తీసుకుని, కేబినెట్లో చర్చించి, అసెంబ్లీలోనే నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ వివరించారు. దీనివల్ల ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు లేకుండా చేశామని సీఎం పేర్కొన్నారు. వర్గీకరణకు తీర్మానం చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కొట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణపై ఉన్న సమస్యలు, అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని మంద కృష్ణ మాదిగకు సీఎం సూచించా ఈ భేటీ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు గారు, సీఎం సలహాదారు వెం నరేందర్ రెడ్డి గారితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, మాదిగ ఉపకులాల ప్రతినిధులు ఉన్నారు