మేడ్చల్ శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో విద్యార్థినీ ఆత్మహత్యాయత్నం
మేడ్చల్ పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో దారుణం చోటుచేసుకుంది. ఫీజు కట్టలేదని పదవ తరగతి విద్యార్థిని అఖిల(16)ను ప్రిన్సిపాల్ రమాదేవి ఫీజు కట్టలేదని అందరి ముందు తిట్టడంతో మనస్థాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కు తరలించారు. విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని విద్యార్థిని తల్లి కమల తెలిపింది. విద్యార్థిని కుటుంబసభ్యులు, బంధువులు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ముందు ఆందోళన చేశారు.