భద్రాది కొత్తగూడెం జిల్లాలో జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు!

భద్రాది కొత్తగూడెం జిల్లాలో జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు!

మవోయిస్టులకు మరో భారీ దెబ్బ పడింది. భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలో పోలీసుల ఆపరేషన్ సక్సెస్ అయింది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట 19 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

వీరిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా కమాండర్ గా వ్యవహరి స్తున్న పీపుల్స్ లిబరేషన్ గెరిళ్లా ఆర్మీ మొదటి బెటాలియన్ కు చెందిన ముగ్గురు సభ్యులున్నారు. పోరాడలేక అలసిపోయా మని, సాధారణ జీవితం గడిపేందుకే లొంగిపోయి నట్లు మావోయిస్టులు చెబుతున్నారు.

ఈ మేరకు జనజీవన స్రవంతిలో కలిసే మావోలకు ఆపరేషన్ చేయూత పేరిట ప్రత్యేక సరెండర్ పాలసీని కేంద్ర ప్రభుత్వం అమలుచే స్తోంది. ఇందులో భాగంగానే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు కొంతమంది తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు.

వారిలో సౌత్ బస్తర్ డీవీసీఎం నరోటి మనీష్ అలియాస్ ఆకాష్ ఉండగా అతనిపై రూ. 8లక్షల రివార్డు ప్రకటించింది ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం. లొంగిపో యిన వారిలో పీఎల్జీఏ మొదటి బెటాలియన్ కు చెందిన మడివి నంద, మడివి హండా , మడివి హడమ సహా పలువురు సెంట్రల్ కమిటీ మెంబర్లకు గార్డుగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు.నందా, హండాపై 4లక్షల రివార్డు ప్రకటించింది ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం.

ఇక పలు విధ్వంసకర ఘటనల్లో కీలకపాత్ర పోషించిన 19 మంది మావోయిస్టులు ఆ పార్టీ సభ్యుల సరెండర్ లో కీలకపాత్ర పోషిస్తున్నట్లు భద్రాధ్రికొత్తగూడెం పోలీస్ యూనిట్ తెలిపింది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు 78 మంది మావోయిస్టుల ను సరెండర్ చేసి 64 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమంలో ఓఎస్డి పరితోష్ పంకాజ్, బెటాలియన్ అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment