బుల్లెట్ బండి నడిపాడని, దళిత యువకుడి చేతుల పై కత్తులతో దాడి చేశారు
తమిళనాడు – శివగంగా జిల్లాలో, మేల్ పిడవూరు గ్రామానికి చెందిన అయ్యాసామి శివగంగాలోనే ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న అయ్యాసామి తనకి ఇష్టమైన బుల్లెట్ బండి కొనుక్కొని రోజు దానిపై కాలేజ్ వెళ్తుండడం పట్ల గ్రామంలోని కొందరు అగ్రవర్ణాల యువకులు ఆగ్రహంతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో అయ్యాసామి బుధవారం కళాశాలకు బుల్లెట్ పై వెళ్తుండగా ముగ్గురు అగ్రవర్ణాల యువకులు అడ్డుకున్నారు
నువ్వు కులం తక్కువోడివి మా ముందు బుల్లెట్ బండి ఎక్కుతావా, నీకు బుల్లెట్ బండి కావాల్సి వచ్చిందా అంటూ కత్తులతో ఆ యువకుడు రెండు చేతుల పై దాడి చేశారు
రక్తపు మడుగులో ఉన్న అయ్యాసామిని చుట్టుపక్కల వారు మధురై రాజాజీ ఆసుపత్రికి తరలించారు
ఇదిలా ఉండగా అయ్యాసామి కుటుంబం ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఆ ముగ్గురు యువకులు అయ్యాసామి ఇంటికి వెళ్లి ఇంట్లో వస్తువులను ధ్వంసం చేశారు
అయ్యాసామి పై దాడి చేసిన ముగ్గురు యువకులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు