‘BRSకు పదేళ్లు.. కాంగ్రెస్‌కు ఏడాదే: కిషన్ రెడ్డి
తెలంగాణకి సీఎం మారారే తప్ప, రాష్ట్రంలో ఇంకేం మారలేదని రాష్ట్ర BJP అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏడాది కాంగ్రెస్ పాలనపై అప్పుడే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. BRS పాలనపై పదేళ్లకు వ్యతిరేకత వస్తే.. కాంగ్రెస్‌పై ఏడాదికే వ్యతిరేకత వచ్చిందంటే వారి పాలన ఎలా ఉందో అర్థం అవుతోందని కిషన్ రెడ్డి అన్నారు.రాష్ట్రంలో దోపిడీ, దుర్మార్గ పాలన కొనసాగుతోందని అన్నారు. గడిచిన పదేళ్లలో శాసన మండలి పూర్తిగా నిర్వీర్యమైందని ధ్వజమెత్తారు. మండలిలో ప్రజల గొంతుక వినిపించేది ఒక్క బీజేపీయేనని అన్నారు. తమ అభ్యర్థులను గెలిపిస్తే.. ప్రతిపక్షంగా మండలిలో వ్యవహరిస్తామని మాటిచ్చారు.అనంతరం అధికారంలో వచ్చాక ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా నెరవేర్చలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనపై పదేళ్లకు వ్యతిరేకత వస్తే.. కాంగ్రెస్‌పై ఏడాదికే వ్యతిరేకత వచ్చిందంటే వారి పాలన ఎలా ఉందో అర్థం అవుతోందని కిషన్ రెడ్డి అన్నారు.