నల్గొండలో మరో ఘోరం

నల్గొండలో మరో ఘోరం

తాగు నీటిలో మొన్న కోతులు, నిన్న వాటర్ ట్యాంక్‌లో శవం, నేడు చనిపోయిన కోళ్లు

హైదరాబాద్ తాగు నీటి కోసం ఉపయోగించే అక్కంపల్లి రిజర్వాయర్లో బర్డ్ ఫ్లూతో మృతి చెందిన వందలాది కోళ్లు

నల్లగొండ జిల్లా – హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే… పిఏ పల్లి మండలంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 80 కోళ్లు మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది

రిజర్వాయర్లో పెద్ద మొత్తంలో చనిపోయిన కోళ్లు వేశారని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది

అసలే ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వార్తల నేపథ్యంలో రిసర్వాయర్లో మృతి చెందిన కోళ్ల ఘటన ఆందోళనకు గురించేస్తుంది

దీనితో అప్రమత్తమైన అధికారులు శుక్రవారం రిసర్వాయర్ ను పరిశీలించారు.

చనిపోయిన కోళ్లు, వాటి వ్యర్ధాలు వేశారనే నేపథ్యంలో రిజర్వాయర్ను ఇరిగేషన్ అధికారులతో కలిసి దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి పరిశీలించారు

రిజర్వాయర్ వెనక జలాలలో దాదాపు 80 కోళ్ల లభ్యం అయ్యాయి. వీటిని స్థానిక రెవిన్యూ సిబ్బందితో బయటికి తీసి రిజర్వాయర్ మొత్తం పరిశీలిస్తున్నారు. రిజర్వాయర్లో కోళ్లను ఎవరు వేశారు అనే కోణంలో విచారణ చేపడుతున్నామని ఆర్డీఓ చెప్పారు

Join WhatsApp

Join Now

Leave a Comment