ఈ నెల 28న పాంబన్ కు ప్రధాని. కొత్త వంతెన ప్రారంభోత్సవంలో పాల్గొననున్న ప్రధాని
తమిళనాడు :ఈ నెల 28న ప్రధాని మోదీ రామనాథపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఆ సందర్భంగా పాంబన్ వద్ద మండపం, రామేశ్వరం దీవిని కలుపుతూ సముద్రంపై రూ.550కోట్లతో నిర్మించిన రైలు వంతెనను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని రామేశ్వరం, ధనుష్కోడి ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. వంతెన ప్రారంభోత్సవ ప్రాంతంలో వేదిక నిర్మాణ పనులకు కూడా అధికారులు శ్రీకారం చుట్టారు.