మహా కుంభమేళకు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం10 మంది భక్తులు మృతి?

మహా కుంభమేళకు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం10 మంది భక్తులు మృతి?

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ప్రయాగ్ రాజ్,జిల్లాలోని మిర్జాపూర్, హైవే పై వెళ్తున్న బస్సును ఓ బొలెరో వాహనం ఢీ కొట్టింది, ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు, మహా కుంభమేళ కు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తుంది..

దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన భక్తులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ క్రమంలో మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేయడానికి చర్యలు తీసుకున్నారు.

ఈ విషాదకరమైన ఘటన శుక్రవారం రాత్రి చోటుచే సుకుంది. ప్రయాగ్‌రాజ్ నుంచి మీర్జాపూర్ వెళ్ళే హైవేపై ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో భక్తులతో నిండిన బొలెరో వాహనం, వేగంగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో బొలెరోలో ప్రయాణిస్తున్న 10 మంది భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది గాయప డగా.. వారిని ఆసుపత్రి తరలించారు.

మృతులు, గాయపడిన వారు ఛత్తీస్‌గఢ్ కోర్బా జిల్లాకు చెందినవారు. ఈ భక్తులు సంగమ స్నానం కోసం మహా కుంభమేళా వెళ్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది భక్తులు కూడా గాయపడ్డారు.

ఈ భక్తులు మధ్యప్రదేశ్‌ లోని రాజ్‌గఢ్ జిల్లాకు చెందినవారు, వారణాసి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. గాయపడిన వారిని రామ్‌ నగర్‌లోని సీహెచ్‌సీలో చేర్చారు. అక్కడ వారికి తక్షణ వైద్య సహాయం అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment