ఏపీలో న్యాయవాదుల గుమస్తాలకు మరణానంతర ఆర్థిక ప్రయోజనం పెంపు
ఏపీలో న్యాయవాదుల గుమస్తాల (క్లర్కులు) మరణానంతరం వారి కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక ప్రయోజనాన్ని రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచుతూ ఏపీ అడ్వొకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ప్రాంగణంలో ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నల్లారి ద్వారకానాథరెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. క్లర్కుల వైద్య ప్రయోజనాలను రూ.80వేలకు పెంచారు.