బచ్పన్ పాఠశాలో కన్నుల పండుగలా యాన్యువల్ డే సెలబ్రేషన్
చదువుతోపాటు సోషల్ రెస్పాన్సిబిలిటీ నేర్పించండి
టీవీ ఫోన్లతో ఏకాగ్రత లోపిస్తుంది
వినటంతో ఏకాగ్రతతో పాటు నాలెడ్జ్ పెరుగుతుంది
సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాఘవేంద్రరావు
బచ్పన్ పాఠశాలో కన్నుల పండుగలా యాన్యువల్ డే సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు చదువుతో పాటు సోషల్ రెస్పాన్సిబిలిటీ నేర్పించాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు అన్నారు. వికారాబాద్ పట్టణ కేంద్రంలోని బచ్పన్ ప్లే స్కూల్ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాఘవేంద్రరావు మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువుతోపాటు సమాజంపై సాంఘిక బాధ్యత కలిగుండేలా తయారుచేయాలని తెలిపారు. ప్రస్తుత తరుణంలో పిల్లలకు ప్రతి విషయం టీవీ ఫోన్లు ఐపాడ్లు ఇచ్చి నేర్పించడంతో పిల్లలకు ఏకాగ్రత లోపిస్తుందని అన్నారు. ప్రతి విషయము తెలుసుకోవాలన్న సాంఘిక మాధ్యమాలపై ఆధారపడవలసి వస్తుందని గుర్తుంచుకునే కెపాసిటీ తగ్గుతుంది అన్నారు. పిల్లలకు ఓపికగా ప్రతి విషయాన్ని వినడం నేర్పించాలని దీంతో ఏకాగ్రత పెరిగి ప్రతి విషయంపై నాలెడ్జ్ నిర్మాణం అవుతుందని అన్నారు. మహాభారత రచనలో వ్యాస మహర్షి చెప్పిన విషయాన్ని సరైన రీతిలో వినటంతో వినాయకుడు అంత పొద్దికగా మహాభారత రచన చేశాడని అన్నారు. విద్యార్థులకు తల్లిదండ్రులు ఉదయం సరైన సమయానికి లేపే అలవాటు నేర్పాలని దాంతోనే సరైన క్రమశిక్షణ అలవాటు పడుతుందని అన్నారు. విద్యార్థులకు మంచి ఆహారం అందించడం కూడా మంచి ఆరోగ్యానికి ఏకాగ్రతకు సహకరిస్తుందని దాంతో మెరుగైన విద్యార్థులను తయారు చేయవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ రాజ్యలక్ష్మి, ప్రిన్సిపల్ శ్వేతా ప్రశాంతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. వార్షికోత్సవంలో ప్రతి తరగతిలోని విద్యార్థినీ విద్యార్థులు చేసిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీలు సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.