తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ రవిచంద్ర

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ రవిచంద్ర

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి,భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించి ప్రజల 70 ఏళ్ల కలను నిజం చేసిన మహానేత కేసీఆర్ అని ఆయన కొనియాడారు.పదేళ్ల కేసీఆర్ సుపరిపాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది బంగారుమయం అయ్యిందని ఒక ప్రకటనలో ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.రాష్ట్ర ఏర్పాటుకు ముందు అందరూ కూడా దండుగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగ అని ఆచరణలో నిరూపించిన మహనీయులు కేసీఆర్ అని ఎంపీ వద్దిరాజు వివరించారు.గోదావరి జలాలు వృధాగా సముద్రం పాలవ్వ కుండా మహత్తరమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి రికార్డు సమయంలో పూర్తి గావించి తెలంగాణను సస్యశ్యామలంగా తీర్చిదిద్దిన దార్శనికులు కేసీఆర్ అని ఎంపీ రవిచంద్ర ప్రస్తుతించారు.కేసీఆర్ పెద్ద సంఖ్యలో గురుకులాలను నెలకొల్పి అన్ని వర్గాల వారికి ఇంగ్లీష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యతో పాటు పోషకాహారాన్ని అందించారని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధకులు,తెలంగాణ అభివృద్ధి ప్రధాత, తెలంగాణ జాతిపిత జన్మదినం సందర్భంగా సోమవారం (రేపు, 17వతేదీ)మనమందరం పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుదామని బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు ఎంపీ వద్దిరాజు పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment