కేసీఆర్ (KCR) అంటే కేవలం మూడు అక్షరాలే కాదు.. నాలుగు కోట్ల మంది ప్రజల గుండెచప్పుడు. ప్రత్యేక తెలంగాణకు ఊపిరి ఇచ్చిన వ్యక్తి. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఉద్యమాన్ని పరిగెత్తించిన శక్తి. సుమారుగా 13 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని తన భూజాలపై నడిపించిన యోధుడు. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా పదేళ్లు రాష్ట్రాన్ని ప్రగతిపధంలో నడిపించిన లీడర్.
దశాబ్దాలుగా తెలంగాణను పట్టి పీడిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపించేందుకు ప్రయత్నించారు. తెలంగాణలోఎంతో దిగువన ప్రవహించే గోదావరిని ఎత్తిపోసుకవడానికి అన్ని చోట్లకు తరలించడానికి కాళేశ్వరం నిర్వహించారు. అదే కాళేశ్వరం ఇవాళ ప్లాన్ చేయాలంటే కనీసం ఐదు లక్షల కోట్లు అవుతుంది. ఇక హైదరాబాద్ రూపరేఖలు మారిపోయాయి. విదేశీ నగరాల లుక్ వచ్చింది. పాలన విషయంలో…అభివృద్ధి విషయంలో కేసీఆర్ ది వంక పెట్టలేని పాలన అందించారు.
కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో అనేక సంస్కరణలను అమలు చేశారు. ఆయన పాలనలో తెలంగాణలో ప్రగతి సాధించిన ముఖ్యమైన రంగాలు, సంస్కరణలు ఇవే:
1. రైతు సంక్షేమం
రైతు బంధు: తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రారంభించిన తొలి పథకం.
రైతు బీమా: రైతులు మరణించినప్పటికీ, వారి కుటుంబాలకు రూ. 5 లక్షల జీవిత బీమా అందించే పథకం.
కాళేశ్వరం ప్రాజెక్ట్: దేశంలోనే అతిపెద్ద నీటి ప్రాజెక్టుగా రూపొందించినది.
2. విద్యా రంగ సంస్కరణలు
గురు కుల పాఠశాలలు: బడుగు, బలహీన వర్గాల పిల్లల కోసం ప్రత్యేకంగా అనేక గురుకుల పాఠశాలలు స్థాపించటం.
ఇంజినీరింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్: విద్యార్థులకు ట్యూషన్ ఫీజును ప్రభుత్వం భరించే విధానం.
3. వైద్య ఆరోగ్య సేవలు
బస్తీ దవాఖానాలు: పేద ప్రజలకు సమీపంలోనే ఉచిత వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.
కంటి వెలుగు:ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు మరియు అవసరమైన వారికీ గ్లాసులు అందించే పథకం.
4. విద్యుత్ రంగంలో విప్లవం
24 గంటల ఉచిత విద్యుత్: రైతులకు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ అందించే విధానం.
పవర్ గ్రిడ్ విస్తరణ: కొత్త విద్యుత్ స్టేషన్లు ఏర్పాటు చేసి, రాష్ట్రాన్ని పవర్ కట్ లేని రాష్ట్రంగా మార్చడం.
5. సంక్షేమ పథకాలు
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్: పేద కుటుంబాల్లో అమ్మాయిల పెళ్లికి ఆర్థిక సహాయం.
అసరా పెన్షన్: వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్ అందించే పథకం.
దళిత బంధు: దళితులకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించే పథకం.
6. నగరాభివృద్ధి మరియు రవాణా
హైదరాబాద్ మెట్రో రైల్: దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్-పబ్లిక్ భాగస్వామ్య మోడల్ మెట్రో ప్రాజెక్ట్.
ఒర్బిటల్ రింగ్ రోడ్: హైదరాబాదుకు మరింత మంచి రవాణా వ్యవస్థను అందించేందుకు తీసుకున్న కీలక నిర్ణయం.
ఆయన చేపట్టిన ఈ సంస్కరణలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయి.
కేసీఆర్ అన్నింటిలోనూ వందకు వంద శాతం పర్ ఫెక్ట్ కాకపోవచ్చు. అలా ప్రతి విషయంలోనూ నూటికి నూరుశాతం కరెక్ట్ గా ఉండేవారు ఉండరు. ఆయన కూడా కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు.
కేసీఆర్..బీఆర్ఎస్ రాజకీయంగా చేసిన వ్యూహాత్మక తప్పిదాల వల్ల జరిగి ఉండవచ్చు కానీ.. ఈ కారణంగా ఆయన సాధించిన విజయాలను.. తెలంగాణ కోసం చేసిన పోరాటాన్ని తక్కువ చేయలేం.
కేసీఆర్ కు తెలంగాణ చరిత్రలో ప్రత్యేక అథ్యాయం ఎప్పటికీ ఉంటుంది.
తెలంగాణ జననేతకు జన్మదిన శుభాకాంక్షలు.