ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్టేజ్ పై పవన్ కళ్యాణ్ తో ముచ్చటించిన ప్రధాని మోడీ.

ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్టేజ్ పై పవన్ కళ్యాణ్ తో ముచ్చటించిన ప్రధాని మోడీ.

దిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకార కార్యక్రమం ఇవాళ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ మధ్య సరదా సంభాషణ జరిగింది. పవన్‌ కల్యాణ్‌ ఆహర్యాన్ని చూసి మోదీ.. మీరు హిమాలయాలకు వెళ్తున్నారా? అని ప్రశ్నించారు. దానికి పవన్‌ ‘‘నేను ఎక్కడికి వెళ్లట్లేదు.. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. హిమాలయాలకు వెళ్లడానికి ఇంకా సమయం ఉంది’’అని అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా పవన్‌కల్యాణ్‌ మీడియాకు వెల్లడించారు.ఇటీవలే ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించగా.. ఈరోజు ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ, స్పీకర్‌గా విజేందర్ గుప్తా.. మంత్రులుగా ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా, పంకజ్ కుమార్, కపిల్ మిశ్రా, రవీంద్ర ఇంద్రజ్‌లు ప్రమాణం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment