ఏపీలో 1,535 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,535 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ వెల్లడించారు. “ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమవుతాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 10,58,892 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. వేసవి దృష్ట్యా ఆయా కేంద్రాలవద్ద అన్నిసౌకర్యాలు కల్పించాలి. పరీక్షల సమయంలో ప్రశ్నపత్రాల లీకేజీ వంటివి కఠిన చర్యలు తీసుకోవాలి”అని అధికారులను ఆదేశించారు.