అక్రమాలపై హైడ్రా కొరడా…

అక్రమాలపై హైడ్రా కొరడా…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట భూదేవి హిల్స్ పరిధిలోని గురువారం హైడ్రా అధికారులు కొరడా ఝులిపించారు. పరికిచెరువు ఎఫ్ టీ ఎల్ పరిధిలోని అక్రమంగా వెలసిన కట్టడాలపై జేసిబితో కూల్ కూల్చివేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులతో భారీ బందోబస్తు మోహరించి కూల్ కూల్చివేతలు చేసారు. ఉదయం నుంచి మొదలుపెట్టిన కూల్చివేతలు సాయంత్రం వరకు కొనసాగాయి.

పరికి చెరువు ఎఫ్ టీ ఎల్ బఫర్ జోన్ పరిధిలోని నిర్మించిన రెండు భవంతులను బేస్మెంట్ లతో సహా తొలగించారు. ఈ అక్రమాలపై గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదులు అందగా ఎట్టకేలకు గురువారం కూల్చివేతలు చేపట్టారు. ఈ కూల్చివేతలలో హైడ్రా అధికారులతో పాటు కుత్బుల్లాపూర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఖలీం, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment