సైబర్ నేరాలు, నూతన చట్టాల గురించి అవగాహన

సైబర్ నేరాలు, నూతన చట్టాల గురించి అవగాహన

గజ్వేల్ మండలం గౌరారం ఎం జె పి టి బి సి డబ్ల్యూ విద్యార్థినిలకు మహిళల రక్షణ చట్టాల గురించి, ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో, షీ టీమ్స్, యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు,నూతన చట్టాల గురించి అవగాహన కల్పించిన గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి, గజ్వేల్ షీటీమ్ బృందం భరోసా సిబ్బంది. ఈ సందర్భంగా గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, మాట్లాడుతూ చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దు, ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలని సూచించారు. కష్టపడి చదవాల్సిన వయస్సులో చెడు అలవాట్లకు బానిసలు కావద్దని సూచించారు. కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు.

నూతన చట్టాలతో మహిళల రక్షణకు పెద్దపీట వేయడం జరిగింది. నూతన చట్టాలలో నేరం చేసిన నేరస్తులకు కఠినమైన శిక్షలు అమలు చేయడం జరుగుతుందన్నారు. బాధితులకు అండగా చట్టాలు నిలుస్తాయని పేర్కొన్నారు. మహిళలు, పిల్లలు ఎవరితోటైనా హింసకు ఎవరైనా హేళనంగా మాట్లాడిన మౌనం వీడి తల్లిదండ్రులకు కానీ స్నేహితులకు కానీ చెప్పుకోవాలని తెలిపారు. లేనిపక్షంలో డయల్-100 కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలన్నారు. మహిళల పిల్లల రక్షణకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. పిల్లలు మహిళలు ఏమైనా సమస్యలు ఇంట్లో కానీ బయట కానీ ఎదుర్కొంటే వెంటనే షిటీమ్ వాట్సప్ నెంబర్ 8712667343 మహిళా పోలీస్ స్టేషన్ నెంబర్ 8712667435, సమాచారం అందించాలని, సమాచార అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ భాస్కర్ రావు, అధ్యాపకులు, గజ్వేల్ షీటీమ్ ఏఎస్ఐ శ్రీరాములు, మహిళ కానిస్టేబుల్ లావణ్య, కానిస్టేబుల్ మహేష్, భరోసా సెంటర్ సిబ్బంది హరిత, సౌమ్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment