ఎస్. లింగోటం గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహనా కార్యక్రమం
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మరియు ప్రజల్లో భద్రతపై అవగాహన కల్పించేందుకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, HRC రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ NGO, క్రైమ్ & ట్రాఫిక్ పోలీస్ సంయుక్తంగా రోడ్డు భద్రత అవగాహనా కార్యక్రమాన్ని ఎస్. లింగోటం గ్రామంలో నిర్వహించారు. ప్రతిరోజూ రాత్రి 8:00 గంటలకు కంపెనీ కార్మికులు ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపై నడుస్తున్నారు. ఈ ప్రయాణ సమయంలో అనేక ప్రమాదాలు చోటుచేసుకోవడంతో, వాటిని నివారించేందుకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ పారా లీగల్ వాలంటీర్లు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో క్రైమ్ CI మన్మథ కుమార్, ASI కర్నాకర్, ట్రాఫిక్ SI అంజనేయులు, ASI ఇడ్డయ్య, అలాగే పారా లీగల్ వాలంటీర్లు చెన్నోజు శశాంక్, బొల్లోజు సందీప్ కుమార్, MD గౌస్, పుల్లిగిళ్ల సాయి కిరణ్ పాల్గొన్నారు. అలాగే NGO వాలంటీర్లు చెన్నోజు సాయినాథ్,కొల్లూరి విక్రం, పురుషోత్తం గ్రామ ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా, పాదచారులు జాగ్రత్తగా నడవడం, ప్రతిఫలిత వస్త్రాలు ధరించడం, ట్రాఫిక్ నియమాలను పాటించడం, రాత్రి సమయంలో రోడ్డుపై అవగాహనతో ఉండటం వంటి ముఖ్యమైన అంశాలపై అధికారులు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థులకు రోడ్డు భద్రతపై స్పష్టమైన అవగాహన కల్పించబడింది.