ప్రాణానికే ముప్పు.. కొండపల్లి మున్సిపాలిటీ లో కాలుష్యభూతం.
పీల్చే గాలి.. త్రాగే నీరు.. నడిచే నెల.. కాలుష్యం తో హై‘రణ’.
బూడిదతో బేంబేలెత్తి పోతున్న నవ్యంధ్ర రాజధాని అమరావతి ‘కి‘ చేరువలో ఉన్న ప్రాంతం.
ఇదే అదునుతో ఏకమైనా వైసీపీ – కూటమి లోని జనసేన, బీజేపీ
ప్రజా శ్రేయసు కోసమే అని అంటున్న ఇరుపార్టీల నేతలు..
ఎన్టీఆర్ జిల్లా,మైలవరం నియోజకవర్గం
నవ్యంధ్ర రాజధాని అమరావతి కి అతి చేరువలో ఉన్న ఈ ప్రాంత ప్రజలు వి టీ పి ఎస్ మహమ్మారి బూడిద తో పడే కష్టం అంత ఇంత కాదు పీల్చే గాలి.. త్రాగే నీరు.. నడిచే నెల.. అన్ని రకాలుగా కాలుష్యం తో హై‘రణ’ చెందుతున్నారు ఇబ్రహీంపట్నం – కొండపల్లి మరియు పరిసరా 104 గ్రామాల ప్రజలు.
విటీపీఎస్ పొగ గొట్ట(చింని)ల ద్వారా పై నుండి బూడిద నేరుగా పడుతూ ఒక వైపు.. మరోవైపు థెర్మల్ బూడిద కలిసి త్రాగే నీరు కాలుషతం అవుతు ప్రజల ప్రాణాలతో చాలగటం ఆడుతున్నారు నిద్రవేస్థలో ఉన్న అధికారులు.ఎన్నో అర్జీలు ఇచ్చిన, హెచ్చరికలు,ధర్నాలు చేసిన నిమ్మకు నీరేతినట్టే వ్యవహారిస్తున్నారు ప్రభుత్వారంగా సంస్థ పెద్దలు.
ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీ కొండపల్లి మున్సిపాలిటీ ‘వైసీపీ‘ నాయకుల తో కూటమి(జనసేన, బీజేపీ)పార్టీలు కలిసి ఉద్యమించటం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా నిలిచింది.
శనివారం మధ్యాహ్నం ఇరు పార్టీ నాయకులు ఒకే అంశం పై కలిసి పోరాటం చైయడం మీడియా తో మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలగచేసింది.
కూటమి లో ఉన్న జనసేన బీజేపీ పార్టీలు వైసీపీ తో కలిసి నిరసనగా చైయటం దేనికి సంకేతం అని అడగగా ఏడాదిన్నారా క్రిందటే డాక్టర్ ఎన్టీటీపిఎస్ నుండి వెలువడుతున్న కాలుష్యన్ని అరికట్టెందుకు తమ గ్రామాలను కాలుష్యరహిత ప్రాంతాలుగా మార్చేందుకే పోరాట సమితి పేరుతో కలిసినట్టుగా మీడియా ప్రాతినిధలకు వివరించారు ఇరుపార్టీనాయకులు.
ఏదేమైనా కాలుషుత నీరు – కాలుషుత గాలితో ప్రజలు తమ ప్రాణాలను అరచేతుల్లో పట్టుకు తీరగాల్సివస్తుంది.ఇప్పటికైనా సంబంధిత అధికారులు మత్తునిద్రను వీడి ప్రజల ప్రాణాలు,భవితరాలకు స్వచ్ఛమైనా నీరు – గాలి అందించేవిధంగా చర్యలు చేపట్టాలని,రాజధాని అమరావతి కి చేరువలో ఉజ్వలా భవిష్యత్ ఉన్న మైలవరం నియోజకవర్గo కొండపల్లి – ఇబ్రహీంపట్నం మరియు పరిసర ప్రాంతాలను ఉన్నత నాగరాలుగా తీర్చిదిదేందుకు కృషి చైయాలనీ ప్రజలు కోరుతుండగా వెంటనే కాలుష్యం పై చర్యలు చేపట్టలని లేని యెడల క్షేత్ర స్థాయి లో ఉద్యమాలు చెప్పడతాం అంటూ నాయకులు హెచ్చరిస్తున్నారు.