దాతృత్వం చాటుకున్న టెన్త్ క్లాస్2003-2004 పూర్వ విద్యార్థులు.
చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన ( లారీ డ్రైవర్ ) దేశగోని వెంకటేష్ గౌడ్ కు గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో తన కాలును కోల్పోవడం జరిగింది,విషయం తెలుసుకున్న టెన్త్ క్లాస్ 2003-2004 పూర్వ విద్యార్థులు తమకు తోచిన సహాయం 55,000/- వేల రూపాయలను వెంకటేష్ కు అందజేయడం జరిగింది. అనంతరం టెన్త్ క్లాస్ 2003-2004 పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ దేశగోని వెంకటేష్ మాతోపాటు చదువుకున్న రోజుల్లో చాలా హుషారుగా చలాకిగా అందరితోటి ఉత్సాహంగా ఉండేవాడు. రోడ్డు ప్రమాదంలో తన కాలును కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చిరంజీవి, లింగస్వామి,రవి,మహేందర్ రెడ్డి, సుధాకర్, రవి, నరేష్,రాజశేఖర్, శ్రీశైలం, నరేందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు..