పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ కు సిపిఎం సంపూర్ణ మద్దతు 

పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ కు సిపిఎం సంపూర్ణ మద్దతు

మతోన్మాద బీజేపీని ఓడించండి

అనుభవజ్ఞుడు, విద్యావేత్త ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి

CPM తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు

నేడు స్థానిక పాత్రికేయుల భవన్ లో సిపిఎం ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్,మెదక్, ప్రస్తుత 13 జిల్లాల కార్యదర్శులతో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్,బండారు రవికుమార్ లు మాట్లాడుతూ.. ఉమ్మడి నాలుగు జిల్లాలలో నలుగురు బిజెపి ఎంపీలు ఉండి కేంద్ర బడ్జెట్లో నిధులు తీసుకురావడంలో వైఫల్యం చెందారని, తెలంగాణ విభజన హామీలను ఏ ఒక్కటి బిజెపి నెరవేర్చలేదని, కరీంనగర్ జిల్లాకు బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉండి కూడా సైనిక్ పాఠశాల గాని, కొత్తగా నవోదయ పాఠశాలలు గాని తీసుకు రాలేదని, నిజామాబాదుకు పసుపు బోర్డు ప్రకటించినప్పటికీ కేంద్ర బడ్జెట్లో ఒక్కరూపాయి నిధులు కూడా కేటాయించలేదని, కాజీపేట రైల్వే కోచ్, గిరిజన యూనివర్సిటీ విభజన హామీలలో ఉన్నప్పటికీ ఏ ఒక్క అభివృద్ధి పని సాధించకుండా, బిజెపి కేవలం కులాల, మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తుందని విమర్శించారు. బీజేపీ కేంద్రంలో అధికారన్ని అడ్డుపెట్టుకొని రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తుందని అన్నారు. వ్యాపారవేత్త, అనుభవ రహితుడు అంజిరెడ్డికి టిక్కెట్ ఇచ్చి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకోవాలని చూస్తున్నారని, ప్రజలు గమనించి బిజెపికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు.

సిపిఎం రాజకీయ విధానం మేరకు బిజెపిని ఓడించగలిగే శక్తి, విద్య, సామాజిక సేవ అనుభవం ఉన్న వ్యక్తి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నే అని 13 జిల్లాల కార్యదర్శిల అభిప్రాయం ,సూచన మేరకు కాంగ్రెస్ అభ్యర్థి అయిన వూట్కూరి నరేందర్ రెడ్డి కి సిపిఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూన్నమని నరేందర్ రెడ్డి గెలుపుకు కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని, మేధావులను, గ్రాడ్యుయేట్లను, కలిసి విస్తృత ప్రచారం చేసి నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి వై యాకయ్య, నిజాంబాద్ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, కామారెడ్డి జిల్లా కార్యదర్శి కె.చంద్రశేఖర్, మెదక్ జిల్లా కార్యదర్శి కే నర్సమ్మ, సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి, సిరిసిల్ల జిల్లా కార్యదర్శి ముషం రమేష్, జగిత్యాల జిల్లా కార్యదర్శి పి శ్రీకాంత్, నిర్మల్ జిల్లా దుర్గం నూతన్, ఆదిలాబాద్ జిల్లా లంక రాఘవులు, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కోట శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీ.ముకుంద రెడ్డి, గుడికందుల సత్యం,జి. బీమా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment