సిపిఎం జిల్లా క్లాసుల సందర్భంగా 1వ తేదీన పిల్లాయిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న బహిరంగ సభను జయప్రదం చేయండి – సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపు
మార్చి 1, 2 తేదీల్లో భూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న సిపిఎం జిల్లా క్లాసుల సందర్భంగా 1వ తేదీన సాయంత్రం పిల్లాయిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపు నిచ్చినారు. ఆదివారం సిపిఎం జిల్లా క్లాసులను, బహిరంగ సభను జయప్రదం చేయాలని పిల్లాయిపల్లి గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ సిపిఎం పార్టీ నాటి నుండి నేటి వరకు రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక, సమస్త వృత్తిదారుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరము ఉద్యమాలు నిర్వహిస్తు ప్రజల పక్షాన నికరంగా పోరాడుతుందని అన్నారు. పిలాయిపల్లి గ్రామంలో ఆనాడు భూస్వామ్య, ప్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి కావాలని, గీసేవారికి చెట్టు కావాలని, వెట్టిచాకిరి పోవాలని బక్క చిక్కిన పేదలతో బంధుకూలు పట్టించి పోరాడింది ఎర్రజెండేనని అన్నారు. నేడు పాలకుల అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై కూడా సిపిఎం అనేక సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తుందని తెలియజేశారు. సిపిఎం పార్టీ జిల్లా స్థాయి క్యాడర్ క్లాసులు పిల్లాయిపల్లిలో నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలపై చర్చించి ప్రజా పోరాటాలను రూపొందించబోతున్నామని, ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధితోపాటు మూసీ ప్రక్షాళన కోసం, గోదావరి జలాల సాధన కోసం, ప్రాజెక్టుల పూర్తి కోసం కూడా ఈ క్లాసులలో చర్చించి పోరాటాలు తీసుకుంటామని తెలియజేశారు.ఈ క్లాసుల సందర్భంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పాల్గొంటున్నారని ఈ సభలో గ్రామ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని నర్సింహ కోరారు.ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు మంచాల మధు, గూడూరు బుచ్చిరెడ్డి, శాఖ కార్యదర్శి పత్తి బిక్షపతి, గ్రామ నాయకులు అందెల యాదగిరి, పగిళ్ల మల్లారెడ్డి పాల్గొన్నారు.