చౌటుప్పల్ లో చికెన్ మేళ భారీగా హాజరైన ప్రజలు
చౌటుప్పల్ పట్టణ కేంద్రం వలిగొండ రోడ్డు వద్ద చికెన్, ఎగ్ మేళ నిర్వహించారు. వెంకాబ్, స్థానిక పౌల్ట్రీ ట్రేడర్స్ ఆధ్వర్యంలో చికెన్ మేళ నిర్వహించగా భారీగా ప్రజలు హాజరయ్యారు దాదాపు 500 కిలోల ఉడికించిన చికెను ఉడకబెట్టిన 3000 గుడ్లను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బాడుప్లు కేవలం పక్షులకు మాత్రమే వస్తుందని మనుషులకు రాదని తెలిపారు. 70 డిగ్రీల సెంటిగ్రేట్ దాటిన చికెన్ తింటే ఎలాంటి వ్యాధులు సోకవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకాబ్ సంస్థ తెలంగాణ ఇన్చార్జి సెంథిల్ కుమార్, స్థానిక పౌల్ట్రీ ట్రేడర్స్ యజమానులు గంగిడి ఆనంద్ రెడ్డి, ముత్యాల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు