మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్-మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నరేంద్రరెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు నిజామాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాలకు చేరుకుని ప్రచార సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ సభలో మాట్లాడతారు.
కాగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సిటింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పార్టీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి తరఫున స్వయంగా ప్రచారం చేపట్టనున్నారు. సోమవారం ఒక్కరోజే ఏకంగా మూడు జిల్లాలు పర్యటించి ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11.30 గంటలకు నిజామాబాద్‌కు చేరుకుని అక్కడి ప్రచార సభలో పాల్గొననున్నారు.
కాగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఓటమిని అంగీకరించినట్లేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రచారానికి రావాలని కాంగ్రెస్ నేతులు బెదిరిస్తున్నారని.. బెదిరిస్తే ఓట్లు పడతాయా అంటూ ప్రశ్నించారు. కాగా ఎన్నికల ప్రచారం గడువు మంగళవారంతో ముగుస్తుంది. 27న ఎన్నికలు జరుగుతాయి.