హర్షం వ్యక్తం చేసిన ఎంపీ రవిచంద్ర
వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హర్షం వ్యక్తం చేశారు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కెసిఆర్ సూచనల మేరకు రాజ్యసభలో అనేకమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పటికీ 696 ఎకరాల భూసేకరణ పూర్తికాగా మరో 253 ఎకరాలు సేకరించి పనులు ముమ్మరం చేయవలసిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ హర్షం వ్యక్తం చేశారు..