పుట్టపాక పద్మశాలి కుల బాంధవుల సమావేశం
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం పుట్టపాక పద్మశాలి కుల బాంధవుల సమావేశం మార్కండేశ్వర దేవాలయ ప్రాంగణంలో జరిగినది.ఈ సమావేశంలో పుట్టపాకలో ఉన్న మూడు పద్మశాలి కుల సంఘాలను రద్దుచేసి నూతన కమిటీని ఎన్నుకొనుటకు ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు.ఈ యొక్క స్టీరింగ్ కమిటీలో సభ్యులుగా,చుంచు రంగారావు,గుండు గోవర్ధన్,కొలను అయోధ్య లీగల్ అడ్వైజర్,గజం గురునాథం,సామల వెంకటేశం మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ,బిట్రా శంకర్రావు, గజం అయోధ్య,గంజి కృష్ణయ్య,వీరిని స్టీరింగ్ కమిటీ సభ్యులుగా నియమిస్తూ పద్మశాలి కులాబాంధవులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎలక్షన్ ద్వారా ఎన్నుకునే విధంగా ఎలక్షన్లు తయారుచేసి గ్రామ కుల బాంధవులందరికీ తెలియపరుస్తారు. ఎలక్షన్ విధివిధానాలు మరియు తేదీ నిర్ణయం చేసి తెలియపరుస్తారు అని తెలిపారు.