బెల్లంపల్లి: ప్రభుత్వ డిగ్రీ ,పీజీ కళాశాలలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
బెల్లంపల్లి, మార్చి 07, సమర శంఖం ప్రతినిధి:-బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ ఆధ్వర్యంలోఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.డిగ్రీ కళా శాల వివిధ విభాగాలలో మరిన్ని వనరులు సమ కూర్చు కోవలసిన ఆవశ్యకత గురించి ప్రిన్సిపాల్ వివరించారు.
తహశీల్దార్ జోష్న మాట్లా డుతూ.. మహిళా విద్యార్థులకు, మహిళ అధ్యాపకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవశుభాకాంక్షలు తెలియజేశారు. సమాజం లోని అన్ని రంగాల అభివృద్ధిలో మహిళలు అత్యంత కీలకమని, అన్నారు.
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న వారిలో విద్యార్థులు ముందున్నారని కొనియాడారు. అదేవిధంగా మహిళ అధ్యాపకులు సైతం కళాశాల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు.
ఆలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరిం చుకొని పాడిన పాటలు అలరించాయి, ఆలోచింపజేశాయి. పలువురు విద్యార్థులు, వక్తలు మాట్లాడిన మాటలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్, తహశీల్దార్ జోత్స్న, డిప్యూటీ తహసిల్దార్ కల్పన, కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ ఎంఏ రేష్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.