మరో కేసులో విజయవాడ స్టేషన్ కు పోసాని కృష్ణ మురళి

మరో కేసులో విజయవాడ స్టేషన్ కు పోసాని కృష్ణ మురళి

అమరావతి, మార్చి 08, సమర శంఖం ప్రతినిధి:- పోసాని కృష్ణ మురళి పై కూటమి పార్టీల నేతలు పెట్టిన కేసుల్లో ఆయనకు వరుసగా ఊరటలు దక్కుతుండడం తెలిసిందే, ఈ క్రమంలోనే ఆయనను ఇంకో కేసుల్లో ఇప్పుడు మరో పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.

అయితే శుక్రవారం పోసాని కృష్ణమురళికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో మరో కేసులో కర్నూలు నుంచి విజయ వాడకు పోసానిని పోలీసులు శనివారం తరలిస్తున్నారు.

పోసానిపై వివిధ సెక్షన్ల కింద ఓబులవారిపల్లె పోలీసుల్లు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయగా.. అతనికి బెయిల్ ఇవ్వకూడదని పోలీసు తరుపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే.. కడప మొబైల్ కోర్టు పోసాని తరుపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ.. బెయిల్ మంజూరు చేసింది.

ఈ నేపథ్యంలో మరో కేసు నిమిత్తం పోసానిని కర్నూలు నుంచి విజయవాడకు తరలిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా… విజయవాడలోని భవానీపురం పీఎస్ లో పోసానిపై కేసు నమోదైంది. దీంతో… పీటీ వారెంట్ పై ఆయనను అక్కడకు తీసుకువెళ్లేందుకు విజయ వాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు అనుమతించింది.

వాస్తవానికి.. శుక్రవారం అర్థరాత్రి నరసరావుపేట పోలీసుల కస్టడీ పిటిషన్ ను కోర్టు రద్దు చేసింది. దీంతో.. విజయవాడ భవానీపురం పోలీసులు కర్నూలు జైలుకు చేరుకున్నారు. అనంతరం.. ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ (పీటీ వారెంట్) కింద పోసానిని హైదరాబాద్ మీదుగా విజయవాడకు తరలిస్తున్నారు!

Join WhatsApp

Join Now

Leave a Comment