పద్మశాలీలకు సీఎం రేవంత్ బహిరంగ క్షమాపణ చెప్పాలి: పద్మశాలి సంఘం నేతల డిమాండ్
కరీంనగర్, మార్చి 11, సమర శంఖం ప్రతినిధి:-హైదరాబాదులో ఇటీవల అఖిలభారత పద్మశాలి సంఘం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాసభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్మశాలీలను అవమానపరిచే విధంగా చేనేత మగ్గంపై కాళ్ళకు షూ వేస్కుకొని కూర్చోవడం పద్మశాలీల మనోభావాలను దెబ్బతీశాయని మంగళవారం పద్మశాలి రాష్ట్ర నాయకుడు అడిచర్ల రాజు ఆధ్వర్యంలో కరీంనగర్ లోని తెలంగాణ చౌరస్తా వద్ద చేనేత మగ్గంను పసుపు నీళ్లతో శుద్ధిచేసి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆడిచర్ల రాజు మాట్లాడుతూ పద్మశాలీల మనోభావాలను దెబ్బతీసిన సీఎం రేవంత్ రెడ్డి తమ కులస్తులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలులతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
అలాగే పద్మశాలి చేనేతలకు రైతు భీమా తరహాలో చేనేత భీమా సౌకర్యం కల్పించి, సిఎం ప్రకటించిన రుణమాఫీ వెంటనే అమలు అయ్యే విధంగా జీఓ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ పట్టణ పద్మశాలి సంఘం, ప్రధాన కార్యదర్శి వంగర ఆంజనేయులు, కోశాధికారి గజవెల్లి కనకయ్య, ఉపాధ్యక్షులు తేళ్ల చంద్రశేఖర్ ఎలిగేటి శ్రీనివాస్, దుబాల శ్రీనివాస్, గుంజేంటి శివకుమార్, ఘర్దస్ సతీష్, రాష్ట్ర నాయకుడు అడిచెర్ల శ్రీనివాస్, మాసం గణేష్, ఏలిగేటి శ్రీనివాస్, కమలాకర్, మామడాల ప్రభాకర్, సొల్లేటి శుభాష్, దుస సుధాకర్, కొండ రాజు, రాజేశం, చామనపల్లి పద్మశాలి సంఘం కార్యదర్శి దుడం శ్రీనివాస్, పద్మశాలి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.