జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ
పిఠాపురం, మార్చి 14, సమర శంఖం ప్రతినిధి:-ర్ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సభకు జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షత వహించారు.
సభా ప్రాంగణం 400 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడింది, ప్రధాన ద్వారాలకు మహనీయుల పేర్లు పెట్టారు. సభా ప్రాంగణంలో 15 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భద్రత కోసం 1,700 మంది పోలీసులను నియమించారు, 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో పర్యవేక్షణ చేపట్టారు.
సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, 2018లో నిర్వహించిన పోరాట యాత్రను, 2019 ఎన్నికల్లో ఎదుర్కొన్న ఓటమిని, ఆ తర్వాత కూడా పార్టీ ముందుకు సాగిన విధానాన్ని వివరించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి, పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100% విజయాన్ని సాధించి, ప్రభుత్వంలో భాగస్వామిగా మారిన విషయాన్ని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా, జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయబడింది. పార్టీ బలోపేతం, రాబోయే రోజుల్లో పార్టీని ముందుకు నడిపించేందుకు విధి విధానాలు పవన్ కళ్యాణ్ ప్రసంగం ద్వారా వివరించారు.