నేడు అసెంబ్లీలో కీలక బిల్లు..!

నేడు అసెంబ్లీలో కీలక బిల్లు..!

_ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, మార్చి 15, సమర శంఖం ప్రతినిధి:-
మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి సభకు రానున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానం ఇవ్వనున్నారు

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు త్వరలో మారనుంది. ప్రముఖ కవి, ఉద్యమ కారుడు, పరిశోధకుడు, తెలంగాణ వైతాళికుడిగా పేరుపొందిన సురవరం ప్రతాప్‌రెడ్డి పేరును ఈ విశ్వవిద్యాలయానికి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నిర్ణయాన్ని అధికారికంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ చట్ట సవరణతో సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు విశ్వవిద్యాలయానికి అధికారికంగా ఇవ్వబడుతుందని సమాచారం.

గత సెప్టెంబరు 20న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం, విద్యా రంగంలో ఒక గొప్ప మార్పును సూచిస్తుంది. ఆ సమయంలో మంత్రివర్గ సభ్యులు సురవరంకి ఇచ్చిన గౌరవం. రాష్ట్ర విద్యారంగానికి కొత్త దిశను సృష్టించగలదని అంచనా వేయబడింది.

అయితే ఈ విశ్వ విద్యాలయం పదో షెడ్యూల్‌లో ఉన్నందున ఇప్పటివరకు పేరు మార్చడం ఆలస్యం అయ్యిందని తెలుస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్ర విభజనకు పదేళ్ల సమయం పూర్తయిన సందర్భంగా ఈ మార్పును ప్రతిపాదించడం, రాష్ట్ర వృత్తి విద్యాసంస్థలకు కొత్త గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment